శ్రీవిష్ణు హీరోగా మరో చిత్రం ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-09T03:25:25+05:30 IST
శ్రీవిష్ణు కథానాయకుడిగా లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 11గా బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా

శ్రీవిష్ణు కథానాయకుడిగా లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 11గా బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రదీప్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీవిష్ణు సినిమా అంటే.. విలక్షణ కథతో, భిన్న తరహా చిత్రంగా ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉన్న విషయం తెలిసిందే. శ్రీవిష్ణు కథలను ఎంపిక చేసుకునే తీరుతో పాటు.. బెక్కెం వేణుగోపాల్ నిర్మించే చిత్రం కావడంతో ఈ సినిమాపై సాధారణంగానే అంచనాలు ఉంటాయి. ఇక ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ క్లాప్ నివ్వగా, నిర్మాత శిరీష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి శ్రీరామ్ గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల్లో ఫణికుమార్, విజయలక్ష్మి, గంజి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దర్శకునికి శిరీష్ స్క్రిప్టును అందజేశారు. యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని రోల్‌లో శ్రీవిష్ణు కనిపించనున్నట్లుగానూ, టాప్ టెక్నీషియన్లు ఈ మూవీకి పనిచేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత తెలిపారు.