Hero Nikhil: చెప్పు తెగుద్ది.. అమెరికా అధ్యక్షుడిపై సెన్సేషనల్ కామెంట్స్
ABN , First Publish Date - 2021-08-26T15:20:36+05:30 IST
యంగ్ హీరో నిఖిల్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అందుకు కారణం.. అఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు. రీసెంట్‌గా ఈ దేశం నుంచి అమెరికా సేనలు

సక్రమంగా ఉండే వ్యవస్థను ఎవరైనా పాడుచేస్తే మనకెవరికైనా చాలా కోపం వస్తుంది. కొందరు కోపాన్ని ప్రదర్శించరు. అయితే కొందరు తమ కోపాన్ని బహిరంగంగానే చూపిస్తారు. ఈ రెండు కోవకు చెందిన వ్యక్తి హీరో నిఖిల్. ఈ యంగ్ హీరో ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అందుకు కారణం.. అఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు. రీసెంట్‌గా ఈ దేశం నుంచి అమెరికా సేనలు వైదొలగగానే తాలిబాన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు భయంతో ఇతర దేశాలకు పరుగులు తీస్తున్నారు. కొందరు అమాయకులైతే పలు ఘటనల్లో ప్రాణాలను కూడా కోల్పోయారు. అఫ్ఘనిస్థాన్‌లో ఇలాంటి పరిస్థితికి కారణమైన బైడెన్ గురించి నిఖిల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
‘‘20 ఏళ్లు ఓ దేశాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారు. చివరకు వదిలేసి వెళ్లిపోయారు. మిస్టర్ బైడెన్ మరోసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది యెదవ’’ అని ట్వీట్ చేశారు నిఖిల్. దీనిపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు పెట్రోలు రేట్లు పెరగడంపై కూడా నిఖిల్ కాస్త గట్టిగానే ట్విట్టర్ ద్వారా స్పందించిన సంగతి విదితమే.