హీరో కృష్ణుడు అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-04T16:40:38+05:30 IST

టాలీవుడ్ నటుడు A.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడు అరెస్ట్ అయ్యాడు. శుక్రవారం అర్థరాత్రి మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్నారన్న విషయం తెలుసుకున్న

హీరో కృష్ణుడు అరెస్ట్

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు A.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడు అరెస్ట్ అయ్యాడు. శుక్రవారం అర్థరాత్రి మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు శిబిరంపై దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతూ కృష్ణుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజుతో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. కృష్ణుడు ‘వినాయకుడు’తో పాటు పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.  


Updated Date - 2021-09-04T16:40:38+05:30 IST