సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘రాజా విక్రమార్క’ వేదికపై గాళ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన హీరో కార్తికేయ

ABN, First Publish Date - 2021-11-07T04:33:41+05:30

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి. టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి. టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా నటించింది. నవంబర్ 12న ఈ చిత్రం విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో కార్తికేయ తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు.


తన ప్రేమకథ గురించి కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘ముందు నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్‌లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా. ఆ రోజే ‘నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతా’ అని చెప్పా. ఫైనల్లీ... ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్’’ అని అన్నారు. అనంతరం వేదికపై లోహితకు కార్తికేయ ప్రపోజ్ చేశారు.

Updated Date - 2021-11-07T04:33:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!