డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న హీరో అడివి శేష్

ABN , First Publish Date - 2021-09-20T19:43:21+05:30 IST

‘క్షణం, గూఢచారి, ఎవరు’ లాంటి థ్రిల్లింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు యంగ్ హీరో అడివి శేష్.

డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న హీరో అడివి శేష్

‘క్షణం, గూఢచారి, ఎవరు’ లాంటి థ్రిల్లింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు యంగ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం ‘మేజర్’ సినిమాను విడుదల చేసే ప్రయత్నంలో ఉండగా, ‘హిట్ 2, గూఢచారి 2’ సినిమాలకి కూడా కమిట్ అయ్యారు. ఇదిలా ఉంటే..  ఈ హీరో డెంగ్యూ ఫీవర్ తో ఈ నెల 18న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గతవారం ప్లేట్ లెట్స్ సడెన్ గా పడిపోవడంతో .. వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు తెలిసింది. ఆయన ఆరోగ్యంపై డాక్టర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన హెల్త్ కండీషన్ పై  అధికారికంగా మరిన్ని వివరాలు తెలుస్తాయి. 

Updated Date - 2021-09-20T19:43:21+05:30 IST