సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అదుగో వస్తోంది... బ్యాడ్‌లక్‌ సఖి

ABN, First Publish Date - 2021-11-09T07:00:16+05:30

దురదృష్టానికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటే సఖినే. బ్యాడ్‌లక్‌ అనేది తన చుట్టూ నీడలా.. తిరుగుతుంటుంది. బంగారాన్ని పట్టుకున్నా - పుటుక్కున మట్టైపోయేంత జాతకం ఆమెది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దురదృష్టానికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటే సఖినే. బ్యాడ్‌లక్‌ అనేది తన చుట్టూ నీడలా.. తిరుగుతుంటుంది. బంగారాన్ని పట్టుకున్నా - పుటుక్కున మట్టైపోయేంత జాతకం ఆమెది. మరి అలాంటి సఖి.. అదృష్టదీపంలా ఎలా వెలిగిపోయిందో తెలియాలంటే ‘గుడ్‌ లక్‌ సఖి’ చూడాల్సిందే. కీర్తి సురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఆది పినిళెట్టి, జగపతిబాబు కీలక పాత్రధారులు. సుధీర్‌ చంద్ర నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈచిత్రంలోని ‘అదిగో వస్తోంది బ్యాడ్‌ లక్‌ సఖి’ అనే గీతాన్ని ప్రముఖ కథానాయకుడు రానా విడుదల చేశారు. ‘‘చాలా సరదాగా సాగే పాట ఇది. ఇందులో కీర్తి సురేష్‌ పాత్ర గురించి చెప్పాం. దేవిశ్రీ మంచి ట్యూన్‌ ఇచ్చారు. షూటింగ్‌ మొత్తం పూర్తయ్యింది. ఈ నెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత. 


Updated Date - 2021-11-09T07:00:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!