హీరో మిథున్ చక్రవర్తిని చంపేస్తానని దావూద్ ఎందుకు బెదిరించాడు?
ABN, First Publish Date - 2021-06-16T17:09:44+05:30
బాలీవుడ్‌లో డిస్కోడాన్సర్‌గా పేరొందిన నటుడు మిథున్ చక్రవర్తి...
బాలీవుడ్‌లో డిస్కోడాన్సర్‌గా పేరొందిన నటుడు మిథున్ చక్రవర్తి ఈ రోజు(జూన్ 16)న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మిథున్ జూన్ 16, 1950 న కోల్‌కతాలో జన్మించారు. మిథున్ చక్రవర్తి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు నటిహెలెన్‌కు నృత్యసహాయకునిగా పనిచేశారు. మిథున్ తన నటన, యాక్షన్, డ్యాన్స్‌లలో ప్రతిభను చాటుతూ మంచి నటునిగా పేరొందారు. మిథున్ ఇప్పటివరకూ 350కి పైగా చిత్రాలలో నటించారు. బెంగాలీ, హిందీ, ఒరియా, భోజ్‌పురి, తమిళం, తెలుగు, కన్నడ, పంజాబీ భాషా చిత్రాలలో నటించారు.
మిథున్ చక్రవర్తి తొలిసారిగా శ్రీదేవి సరసన 1984 లో విడుదలైన 'జగ్ ఉఠా ఇన్సాన్' చిత్రంలో నటించారు. ఈ సమయంలో వారి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. పైగా తాను శ్రీదేవిని రహస్య వివాహం చేసుకున్నట్లు మిథున్ చక్రవర్తి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపధ్యంలో మిథున్ చక్రవర్తిని చంపేస్తానంటూ డాన్ దావూద్ ఇబ్రహీం బెదిరించాడు. అయితే ఆసమయంలో హీరో సంజయ్‌దత్ ఈ సమస్య నుంచి మిథున్‌ను రక్షించారట. కాగా మిథున్‌కు లగ్జరీ హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మిథున్ చక్రవర్తి ఇప్పటివరకు రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మూడు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు.