'హ్యాపీ బర్త్ డే మామ': నాగ్‌కి సమంత విషెస్

ABN , First Publish Date - 2021-08-29T18:56:34+05:30 IST

నేడు (ఆగస్ట్ 29) కింగ్‌ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో అక్కినేని కోడలు సమంత కూడా ట్విట్టర్ వేదికగా నాగార్జునకు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్‌ను తెలిపారు.

'హ్యాపీ బర్త్ డే మామ': నాగ్‌కి సమంత విషెస్

నేడు (ఆగస్ట్ 29) కింగ్‌ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో అక్కినేని కోడలు సమంత కూడా ట్విట్టర్ వేదికగా నాగార్జునకు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. "మీమిద నాకున్న గౌరవం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే మామ" అంటూ సమంత ట్వీట్‌ చేశారు. కాగా సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆమె పాత్రకి సంబంధించిన చిత్రీకరణ ముగించి తమిళ మల్టీస్టారర్ 'కాతువాకుల రెండు కాదల్‌' మూవీ చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఇందులో విజయ్ సేతుపతి, నయనతార ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 



Updated Date - 2021-08-29T18:56:34+05:30 IST