సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ సెన్సార్ పూర్తి
ABN, First Publish Date - 2021-07-26T21:07:56+05:30
హీరో సందీప్‌కిషన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `గల్లీరౌడీ`. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. స్టార్ రైటర్ కోన వెంకటన్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు.
హీరో సందీప్‌కిషన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `గల్లీరౌడీ`. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. స్టార్ రైటర్ కోన వెంకటన్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెఢీ, ఈడోరకం ఆడోరకం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్. ‘గల్లీ రౌడీ’ సినిమాను ఆగస్ట్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.