నా లైఫ్‌లోనే గొప్ప అవకాశం : నిధి అగర్వాల్

ABN , First Publish Date - 2021-06-04T22:23:14+05:30 IST

నా లైఫ్‌లోనే గొప్ప అవకాశం అంటున్నారు నిధి అగర్వాల్. 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' సినిమాలలో నటించిన ఈమె 'ఇస్మార్ట్ శంకర్‌'తో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ చూసి అందరు, టాలీవుడ్‌లో నిధికి వరుసగా అవకాశాలు క్యూ కడతాయని భావించారు. కానీ అందరు అనుకున్నంత వేగంగా టాలీవుడ్‌లో అమ్మడి కెరీర్ సాగడం లేదు. ఎప్పుడో అశోక్ గల్లా సరసన ఓ సినిమా కమిటయింది.

నా లైఫ్‌లోనే గొప్ప అవకాశం : నిధి అగర్వాల్

నా లైఫ్‌లోనే గొప్ప అవకాశం అంటున్నారు నిధి అగర్వాల్. 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' సినిమాలలో నటించిన ఈమె 'ఇస్మార్ట్ శంకర్‌'తో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ చూసి అందరు, టాలీవుడ్‌లో నిధికి వరుసగా అవకాశాలు క్యూ కడతాయని భావించారు. కానీ అందరు అనుకున్నంత వేగంగా టాలీవుడ్‌లో అమ్మడి కెరీర్ సాగడం లేదు. ఎప్పుడో అశోక్ గల్లా సరసన ఓ సినిమా కమిటయింది. నత్త నడకన షూటింగ్ సాగుతోంది. అయితే ఈమెకి అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు'లో నటించే అవకాశం దక్కింది. 


ఇంతకముందే ఈ విషయాన్ని తెలిపిన నిధి మరోసారి ఇందులో నటిస్తున్నట్టు, ఇది తన లైఫ్‌లో ఎంతో గొప్ప అవకాశం అని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి షూటింగ్‌లో జాయిన్ అవుతానా అనే ఆతృతతో ఉందట. క్రిష్ డైరెక్షన్‌లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన చిత్రీకరణ తిరిగి త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇక కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిధి జయం రవితో 'భూమి', శింబుతో 'ఈశ్వరన్' సినిమాలు చేసింది. అక్కడ రెండు సినిమాలు ఈమెకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. 

Updated Date - 2021-06-04T22:23:14+05:30 IST