‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ టీజర్: గోపీచంద్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు

ABN , First Publish Date - 2021-11-09T01:15:30+05:30 IST

‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ టీజర్ చూసిన ప్రతి ఒక్కరి నోటి వెంటా వినబడే మాట ఇదే.. ‘గోపీచంద్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు’. ఇటీవల సీటీమార్‌తో మాస్ కెపాసిటీ ఏంటో చూపించిన గోపీచంద్.. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో చేస్తున్న

‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ టీజర్: గోపీచంద్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు

‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ టీజర్ చూసిన ప్రతి ఒక్కరి నోటి వెంటా వినబడే మాట ఇదే.. ‘గోపీచంద్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు’. ఇటీవల సీటీమార్‌తో మాస్ కెపాసిటీ ఏంటో చూపించిన గోపీచంద్.. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో తన మాస్ పవర్ చూపిస్తూనే.. వైవిధ్యమైన నటనను కనబరిచినట్లుగా తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్న మారుతి దర్శకత్వంలో.. మరో సక్సెస్‌ఫుల్ నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌కెఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. 


‘‘ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరిప్పుడు చేస్తున్నారు.. నేనెప్పుడో చేసి, చూసి వచ్చేశా..’, ‘అలాగే నా హీరోయిజానికి ఓ ఆరా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుంచి ఒక ఆర్ఆర్ వినిపిస్తుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి.. కిక్కాస్ ఉంటుంది..’ వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో వచ్చిన ఈ టీజర్.. సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేస్తోంది. అలాగే రాశీఖన్నా, రావు రమేష్ వంటి వారు కనిపించిన తీరు మారుతీ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రంలో భారీగా ఉండబోతుందనేది తెలియజేస్తుంది. ఓవరాల్‌గా ఈ టీజర్‌.. ఈ చిత్రం ‘పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్’ అనే విషయంతో పాటు.. గోపీచంద్ ఈసారి గట్టిగా కొట్టబోతున్నాడనేది మాత్రం తెలియజేస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.Updated Date - 2021-11-09T01:15:30+05:30 IST