సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఈసారైనా ‘ఆరడుగుల బుల్లెట్‌‌’కు మోక్షం లభించేనా?

ABN, First Publish Date - 2021-06-20T23:07:34+05:30

గోపీచంద్ హీరోగా, న‌య‌న‌తార హీరోయిన్‌గా బి. గోపాల్‌ దర్శకత్వంలో.. అప్పుడెప్పుడో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ ఈ చిత్రాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపీచంద్ హీరోగా, న‌య‌న‌తార హీరోయిన్‌గా.. బి. గోపాల్‌ దర్శకత్వంలో.. అప్పుడెప్పుడో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని చాలా కాలం అవుతున్నా.. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. మధ్యలో రెండు మూడు సార్లు ఇదిగో విడుదల అంటూ ప్రకటనలు వచ్చాయి కానీ.. విడుదల కాలేదు. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అంటూ కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అవి కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి చిత్రయూనిట్‌ నుంచి రిలీజ్‌ ప్రకటన వచ్చింది. 


మరి ఈసారైనా ఈ చిత్ర విడుదలకు మోక్షం లభిస్తుందో లేదో తెలియదు కానీ.. థియేటర్స్‌ రీ ఓపెన్‌ అవగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాతలు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేసి విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేస్తామని, చిత్రాన్ని నిర్మాత తాండ్ర మహేష్‌ ఓన్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లుగా ఈ ప్రకటనలో పేర్కొన్నారు. వ‌క్కంతం వంశీ క‌థ‌ అందించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు.

Updated Date - 2021-06-20T23:07:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!