‘హౌస్ అరెస్ట్’.. నవ్వులే నవ్వుల్ అంటున్నారు

ABN , First Publish Date - 2021-08-29T20:42:54+05:30 IST

ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ తొలి చిత్రంగా రూపొందిన చిత్రం ‘హౌస్ అరెస్ట్‌’.ఆగ‌స్ట్ 27న‌ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు

‘హౌస్ అరెస్ట్’.. నవ్వులే నవ్వుల్ అంటున్నారు

ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ తొలి చిత్రంగా రూపొందిన చిత్రం ‘హౌస్ అరెస్ట్‌’.ఆగ‌స్ట్ 27న‌ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేవ్‌, ఫ్ర‌స్టేటెడ్ సునైన‌, కౌశిక్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని శేఖ‌ర్ రెడ్డి యెర్ర ద‌ర్శ‌క‌త్వంలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. సినిమాకు మంచి టాక్ రావడంతో నిర్మాత తన ఆనందాన్ని తెలియజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం థియేటర్స్‌లో నవ్వుల సందడి వినిపిస్తోంది. మా సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి కామెడీ ఈ సినిమాకు హైలెట్. ఒక ఇంట్లో జరిగే కథలో పిల్లలతో సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెడీకి ప్రేక్షకులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా ఈ సినిమాను థియేటర్స్‌లో వీక్షిస్తున్నారు. చాలా కాలం తరువాత చిన్న పిల్లల సినిమాగా హౌస్ అరెస్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ఒకవైపు సోలో హీరోలుగా చేస్తూనే ఈ సినిమాలో సప్తగిరిగారు, శ్రీనివాసరెడ్డిగారు కలిసి నటించి.. కామెడీని పండించారు. వాళ్ల కామెడీకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండటం సంతోషంగా ఉంది..’’ అని అన్నారు.

Updated Date - 2021-08-29T20:42:54+05:30 IST