'గుడ్ లక్ సఖి': రిలీజ్ డేట్ ఫిక్స్..

ABN , First Publish Date - 2021-11-16T14:32:34+05:30 IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం 'గుడ్ లక్ సఖి'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. నగేష్ కుకునూరు దర్శకత్వంలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పడిరి

'గుడ్ లక్ సఖి': రిలీజ్ డేట్ ఫిక్స్..

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం 'గుడ్ లక్ సఖి'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. నగేష్ కుకునూరు దర్శకత్వంలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పడిరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల అయిన పోస్టర్స్, వీడియోలు, లిరికల్ వీడియో సాంగ్స్ సినిమాపై బాగానే ఆసక్తిని పెంచేశాయి. కాగా, 'గుడ్ లక్ సఖి' మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్రయూనిట్ అధికారిక ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 10 వ తేదీన థియేటర్ల లోనే విడుదల చేస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కీర్తి సురేష్‌కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

Updated Date - 2021-11-16T14:32:34+05:30 IST