తప్పు చేస్తే దేవుడు వెంటనే చంపేస్తాడు!
ABN , First Publish Date - 2021-06-13T06:22:24+05:30 IST
‘‘అరే... సైతాన్‌కి, దేవుడికి తేడా ఏంటో తెలుసా? నీలో కోరికలను రెచ్చగొట్టి, నువ్వు తప్పు చేసేలా చేసి, నువ్వు కష్టపడుతుంటే చూసి సైతాన్ ఆనందిస్తాడ్రా! కానీ దేవుడు అలా కాదు. చాలా సింపుల్...

‘‘అరే... సైతాన్‌కి, దేవుడికి తేడా ఏంటో తెలుసా? నీలో కోరికలను రెచ్చగొట్టి, నువ్వు తప్పు చేసేలా చేసి, నువ్వు కష్టపడుతుంటే చూసి సైతాన్ ఆనందిస్తాడ్రా! కానీ దేవుడు అలా కాదు. చాలా సింపుల్... నువ్వు తప్పు చేసినప్పుడే పుట్టుక్కుమని చంపేస్తాడు’’ అని ప్రియదర్శి అంటున్నారు. ఆయన, నందినీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. విద్యాసాగర్ ముత్తు దర్శకత్వం వహించారు. సీనియర్ దర్శకులు సురేశ్ కృష్ణ నిర్మించారు. ఈ నెల 18న ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది. శనివారం ట్రైలర్‌ను హీరో కార్తీ విడుదల చేశారు. అందులో ప్రియదర్శి పైన చెప్పుకొన్న డైలాగ్ చెప్పారు. ‘‘ఆదిగా ప్రియదర్శి, మీనాగా నందినీరాయ్ కనిపిస్తారు. ఆది అనే ప్రమాదకరమైన యువకుడి కథేంటి? మీనాతో అతడికి ఉన్న సంబంధం ఏమిటి? అనేది వెబ్ సిరీస్‌లో చూడాలి’’ అని దర్శకుడు చెప్పారు.