వరుణ్ కూడా వచ్చేస్తున్నాడు!

ABN , First Publish Date - 2021-01-28T18:48:02+05:30 IST

కరోనా కారణంగా గతేడాది స్థబ్దుగా ఉండిపోయిన తెలుగు సినీ పరిశ్రమ జోరు పెంచింది.

వరుణ్ కూడా వచ్చేస్తున్నాడు!

కరోనా కారణంగా గతేడాది స్థబ్దుగా ఉండిపోయిన తెలుగు సినీ పరిశ్రమ జోరు పెంచింది. టన్నుల కొద్దీ వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలువురు హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్స్‌ను ఎనౌన్స్ చేశారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ కూడా తన సినిమా `గని` విడుదల తేదీని ప్రకటించాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది జులై 30న విడుదల కాబోతోంది. 


నూతన దర్శకుడు కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందించిన ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టించింది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ‌వరుణ్‌తేజ్ ఈ సినిమాలో బాక్సర్ పాత్ర‌లో కనిపించనున్నాడు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించాడు.Updated Date - 2021-01-28T18:48:02+05:30 IST