భీమ్లా బ్లాస్ట్‌కి సిద్ధంకండి

ABN , First Publish Date - 2021-12-08T07:06:21+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. రానా కీలక పాత్రధారి. సాగర్‌ చంద్ర దర్శకుడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ సంభాషణలు అందించారు...

భీమ్లా బ్లాస్ట్‌కి సిద్ధంకండి

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. రానా కీలక పాత్రధారి. సాగర్‌ చంద్ర దర్శకుడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ సంభాషణలు అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చితాన్ని విడుదల చేయనున్నారు. సంక్రాంతి సినిమాల మధ్య గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో భీమ్లా నాయక్‌ వస్తాడా? రాడా? అనే అనుమానాలు నెలకున్నాయి. వాటిని నిర్మాత సూర్యదేవర నాగవంశీ పటాపంచలు చేశారు. ‘లాలా.. భీమ్లా.. పాటలోని రషెష్‌ చూశాను. జనవరి 12న భీమ్లా బ్లాస్ట్‌కి రెడీగా ఉండండి’ అంటూ నాగవంశీ ట్వీట్‌ చేశారు. దాంతో సినిమా విడుదల తేదీని మరోసారి ఖాయం చేసినట్టైంది. 


Updated Date - 2021-12-08T07:06:21+05:30 IST