‘గని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ABN , First Publish Date - 2021-08-05T23:00:17+05:30 IST

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న ‘గని’ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుగుతోంది.

‘గని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న ‘గని’ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ  సన్నాహాలు చేస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళికి  సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ గురువారం ప్రకటించింది.  నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో చివరి షెడ్యూల్‌ జరుగుతుంది. ఈ చిత్రం కోసం వరుణ్‌ తేజ్‌ పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్‌ మార్చుకున్నారు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు హాలీవుడ్‌ చిత్రం ‘టైటాన్స్‌’, బాలీవుడ్‌ ‘సుల్తాన్‌’ చిత్రాలకు యాక్షన్‌ సన్నివేశాలను డిజైన్‌ చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ లార్నెల్‌ స్టోవల్‌, వ్లాడ్‌ రింబర్గ్‌ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Updated Date - 2021-08-05T23:00:17+05:30 IST