`గాలి సంపత్`... తండ్రీ కొడుకుల మధ్య బ్యూటీఫుల్ ఎమోషన్: అనిల్ రావిపూడి
ABN , First Publish Date - 2021-02-21T22:15:59+05:30 IST
డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'గాలి సంపత్`. ఈ మూవీ మహా శివరాత్రి కానుకగా మార్చి11న గ్రాండ్‌గా విడుదలవుతుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'గాలి సంపత్`. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ `గాలి సంపత్`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మహా శివరాత్రి కానుకగా మార్చి11న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదారాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...
చిత్ర నిర్మాత ఎస్ క్రిష్ణ మాట్లాడుతూ ``ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి దగ్గర నేను రచయితగా, దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఇప్పుడు గాలి సంపత్ సినిమాతో ఫస్ట్ టైం నిర్మాతగా పరిచయ మవుతున్నాను. నా స్నేహితులు షైన్ స్క్రీన్స్ నిర్మాతలు చాలా సపోర్ట్ సపోర్ట్ చేశారు. దర్శకుడు అనీష్ చాలా చక్కగా తెరకెక్కించాడు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది`` అన్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ``చిన్న సినిమాగా మొదలై అనిల్ రావిపూడి రాకతో ఒక పెద్ద సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. దిల్ రాజు గారు ఎంతో సపోర్ట్ చేశారు. మార్చి 11న థియేటర్లలో రిలీజ్ అవుతుంది మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.

చిత్ర దర్శకుడు అనీష్ మాట్లాడుతూ "గాలి సంపత్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మార్చి11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి గారు ఒక మెంటర్‌గా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు సినిమాలో మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్‌గారు, సాయి కుమార్‌గారు, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ గారు గాలి సంపత్ పాత్రకు ప్రాణం పోశారు. రేపు మార్చి 11న ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు" అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ "ఎస్ క్రిష్ణ నా ప్రతి సినిమాలో స్టోరీ సిట్టింగ్స్‌లో చాలా కీలక పాత్ర పోషించేవాడు. ఫస్ట్ టైం ఒక కథ రాసి ఆ కథతో నిర్మాతగా మారాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. షైన్ స్క్రీన్స్ నిర్మాతలు ముందుకు వచ్చారు. సినిమా విషయానికి వస్తే గాలి సంపత్ అనగానే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌గారి గొంతుకి ప్రమాదం జరిగి అతని గొంతులో నుంచి మాట బయటికి రాదు కేవలం గాలి మాత్రమే వస్తుంది. అదే ఈ సినిమా కాన్సెప్ట్. మీరు బాహుబలి సినిమా తీసుకుంటే అందులో కిలికి భాష అని ఉంటుంది. అది మనకు అర్థం కాదు అలాగే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక చిలిపి భాష మాట్లాడటం జరిగింది. అదే ఫి..ఫి.. ఫీ లాంగ్వేజ్. అది మీ అందర్నీ ఎంతో ఎంటర్‌టైన్ చేయబోతుంది. బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఒక బ్యూటీఫుల్ ఎమోషన్ కూడా ఈ సినిమాలో ఉంది. మార్చి11న ఈ సినిమా విడుదలవుతుంది" అన్నారు.
