సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Prabhas, NTR నుంచి శివాని వరకు.. కొత్త కార్లు కొన్న సెలబ్రిటీల లిస్ట్ ఇదీ.. ఒక్కొక్కరి కారు ధర ఎంతో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-09-26T17:43:48+05:30

కోట్లాది మంది అభిమానులకి సినిమా సెలబ్రిటీలంటే ఇష్టం. కానీ, మన హీరోలు, హీరోయిన్స్‌కి ఏం ఇష్టం? అఫ్‌కోర్స్, కోట్లు ఖరీదు చేసే కార్లంటే మన వాళ్లకి పడి చచ్చిపోయేటంత క్రేజ్! వీలు చిక్కినప్పుడల్లా టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా, అన్ని చోట్లా సినిమా వాళ్లు, కార్లు కొనేందుకు ఎగబడుతుంటారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్స్‌కు సంబంధించిన కార్లను సరదాగా కలెక్ట్ చేసేస్తుంటారు. మరి ఈ మధ్య కాలంలో ఇక్కడ తెలుగు హీరోలు, అక్కడ తమిళ హీరోయిన్స్ స్వంతం చేసుకున్న సూపర్ కాస్ట్‌లీ కార్లు ఏవి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట్లాది మంది అభిమానులకి సినిమా సెలబ్రిటీలంటే ఇష్టం. కానీ, మన హీరోలు, హీరోయిన్స్‌కి ఏం ఇష్టం? అఫ్‌కోర్స్, కోట్లు ఖరీదు చేసే కార్లంటే మన వాళ్లకి పడి చచ్చిపోయేటంత క్రేజ్! వీలు చిక్కినప్పుడల్లా టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా, అన్ని చోట్లా సినిమా వాళ్లు, కార్లు కొనేందుకు ఎగబడుతుంటారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్స్‌కు సంబంధించిన కార్లను సరదాగా కలెక్ట్ చేసేస్తుంటారు. మరి ఈ మధ్య కాలంలో ఇక్కడ తెలుగు హీరోలు, అక్కడ తమిళ హీరోయిన్స్ స్వంతం చేసుకున్న సూపర్ కాస్ట్‌లీ కార్లు ఏవి? 



నాలుగు కోట్ల ‘మెగా’ మెర్సిడిజ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త కారు కొన్నాడు. అలాంటి ఇలాంటిదైతే పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన తాజా మెర్సిడిజ్ ఏకంగా 4 కోట్లు ఖరీదు చేసేది కావటంతో అందరూ ‘వావ్’ అనకుండా ఉండలేకపోయారు. చెర్రీ రీసెంట్‌గా ‘మెర్సిడిజ్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600’ తన గ్యారేజ్‌కి తెచ్చుకున్నాడు. ఈ కష్టమైజ్డ్ వర్షన్ మెగా కారు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చగా మారింది!



నందమూరి వారి నయా కార్! 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ మధ్యే భారీ కారు కొన్నాడు. అంతే కాదు, 3.16 కోట్ల తన సూపర్ కాస్ట్‌లీ లగ్జరీ కారుకి 17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ సాధించుకున్నాడు. ఆర్టీఏ వారి వేలం పాటలో ‘9999’ కోసం లక్షలు గుమ్మరించాడు. ఇంతకీ మన సింగమలై ‘ఆల్ నైన్స్’ క్రేజీ న్యూ కార్ ఏ కంపెనీది? ‘లాంబోర్గిని గ్రాఫైట్ క్యాప్సుల్‘ ఆయన కార్స్ కలెక్షన్‌లో తాజా అట్రాక్షన్!



ఆల్ న్యూ ‘ఆదిపురుష్‘ కారు... ఆరు కోట్లు!

‘ఆర్ఆర్ఆర్’ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే కాదు... మరో రాజమౌళి సూపర్ హీరో, ప్రభాస్ కూడా, కొన్నాళ్ల కింద కళ్లు చెదిరిపోయే కార్ కొన్నాడు. ‘బాహుబలి‘ ఏకంగా ఆరు కోట్లు ఖర్చు చేసి భారీ రాజహంసని ఇంటికి తెచ్చుకున్నాడు! ‘సాహో’ స్టార్ న్యూ లాంబోర్గిని మోడల్ పేరు ‘అవెంటడార్ రోడ్‌స్టర్’... 



కోలీవుడ్ బీఎండబ్ల్యూ బ్యూటీస్! 

హీరోలే కాదు... హీరోయిన్స్ కూడా లగ్జరీ కార్ల రేసులో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఇద్దరు చెన్నై బ్యూటీస్ తమ బీఎండబ్ల్యూస్‌తో ఛమక్కున మెరిసిపోయారు. రమ్య పాండియన్ దాదాపు 68 లక్షలు ఖరీదు చేసే ‘బీఎండబ్ల్యూ జీటీ’తో కెమెరాకు ఫోజిచ్చింది. ఆమె కార్స్ కలెక్షన్‌లో ఇదే మొదటి బీఎండబ్ల్యూనట! ఇక మరో తమిళ పొన్ను శివానీ నారాయణన్ సైతం బ్యూటీఫుల్ బీఎండబ్ల్యూ ఒకటి స్వంతం చేసుకుంది. ఆమె తన 1.2 కోట్ల ‘సిరీస్ 7‘ బీఎండబ్ల్యూ బీస్ట్‌ని సొషల్ మీడియాలో నెటిజన్స్‌తో షేర్ చేసుకుంది.

Updated Date - 2021-09-26T17:43:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!