సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దసరాకు... సంద-డి

ABN, First Publish Date - 2021-09-22T06:26:43+05:30

రోషన్‌, శ్రీలీల జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన సినిమా ‘పెళ్లి సంద-డి’. గౌరీ రోణంకి దర్శకురాలు. సెన్సార్‌ నుంచి క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ లభించిన ఈ చిత్రాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోషన్‌, శ్రీలీల జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన సినిమా ‘పెళ్లి సంద-డి’. గౌరీ రోణంకి దర్శకురాలు. సెన్సార్‌ నుంచి క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ లభించిన ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని తెలియజేశారు. ఇదొక అందమైన ప్రేమకథా కుటుంబ చిత్రమనని వారు తెలిపారు.


మహేశ్‌బాబు చేతుల మీదుగా ట్రైలర్‌!

‘పెళ్లి సంద-డి’ ట్రైలర్‌ను బుధవారం మహేశ్‌బాబు విడుదల చేయనున్నట్టు తెలిసింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘రాజకుమారుడు’తో  మహేశ్‌ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. వశిష్ఠ పాత్రలో రాఘవేంద్రరావు, ఇతర పాత్రల్లో ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేశ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: శివశక్తి దత్తా, చంద్రబోస్‌, సంగీతం: ఎం.ఎం. కీరవాణి.


Updated Date - 2021-09-22T06:26:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!