‘ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్’ టీజ‌ర్ విడుద‌ల‌

ABN , First Publish Date - 2021-01-01T23:36:21+05:30 IST

కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్న పేరు ‘ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్’. నాలుగు పేర్లతో ఉన్న ఈ టైటిల్‌తో శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ

‘ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్’ టీజ‌ర్ విడుద‌ల‌

కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్న పేరు ‘ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్’. నాలుగు పేర్లతో ఉన్న ఈ టైటిల్‌తో శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది ఆ సంస్థకు 14వ చిత్రం. జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా.. టైటిల్‌లోని మ‌రో ప్ర‌ధాన పాత్ర చిట్టిగా బేబి స‌హ‌శ్రిత న‌టిస్తోన్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షార్ట్‌క‌ట్‌లో ఈ సినిమా 'ఎఫ్‌సీయూకే'గా పాపుల‌ర్ అయ్యింది. ఒక్కో పాత్రకు సంబంధించిన పోస్టర్స్‌తో ఇప్పటికే సోషల్‌ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారిన ఈ చిత్రం నుంచి.. నూతన సంవత్సర కానుకగా చిత్రయూనిట్‌ టీజర్‌ను విడుదల చేసింది. పోస్టర్స్‌ ఆకర్షించినట్టే.. ఈ టీజర్‌ కూడా నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.


ఒక నిమిషం నిడివి క‌లిగిన ఈ టీజ‌ర్‌లో నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. అయితే ఇక్క‌డ చెప్పుకోవాల్సింది జ‌గ‌ప‌తిబాబు (ఫాద‌ర్‌), బేబి స‌హ‌శ్రిత (చిట్టి) మ‌ధ్య అనుబంధం గురించి. ఒక ట్రెండ్‌సెట్టింగ్ యూత్‌ఫుల్‌ రొమ్‌కామ్‌గా ఈ సినిమా రూపొందినట్లుగా టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది. నాలుగు పాత్ర‌లు.. ఫాద‌ర్‌, చిట్టి, ఉమా, కార్తీక్‌.. ఆ పాత్ర‌ల మ‌ధ్య వినోద‌భ‌రిత అనుబంధం ఉత్తేజాన్ని క‌లిగిస్తూ, సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఇతివృత్తం ఏమిట‌నేది వెల్ల‌డించ‌కుండా ఉత్కంఠ‌త‌ను పెంచుతోంది చిత్ర బృందం. టీజ‌ర్ విడుద‌ల‌వ‌డం, దానిని ప్ర‌శంసిస్తూ టాలీవుడ్ సెల‌బ్రిటీలు కామెంట్లు చేయ‌డంతో 'ఎఫ్‌సీయూకే' సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. త్వ‌ర‌లో సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ పేర్కొంది.



Updated Date - 2021-01-01T23:36:21+05:30 IST