‘జాతిరత్నాలు’ సుందరికి మరో క్రేజీ ఆఫర్
ABN , First Publish Date - 2021-12-30T20:28:44+05:30 IST
‘జాతిరత్నాలు’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి చిత్రంతోనే కుర్రకారు మనసుదోచుకొని క్రేజీ హీరోయిన్ అయిపోయింది. సినిమా సూపర్ హిట్ అవడం ఆమెకు మరింత అడ్వాంటేజ్ అయింది. ప్రస్తుతం ఫరియా రెండో అవకాశం కోసం ఎదురు చూస్తోంది. పలు చిత్రాలు ప్లానింగ్ ఉన్నప్పటికీ ఇంత వరకూ ఆమె రెండో సినిమా మొదలు కాలేదు. అయితే నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ‘బంగార్రాజు’ లో ఫరియా ఓ స్పెషల్ సాంగ్ లో నర్తి్స్తోంది.

‘జాతిరత్నాలు’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఆ సినిమాతో కుర్రకారు మనసుదోచుకొని క్రేజీ హీరోయిన్ అయిపోయింది. సినిమా సూపర్ హిట్ అవడం ఆమెకు మరింత అడ్వాంటేజ్ అయింది. ప్రస్తుతం ఫరియా రెండో అవకాశం కోసం ఎదురు చూస్తోంది. పలు చిత్రాలు ప్లానింగ్ ఉన్నప్పటికీ ఇంత వరకూ ఆమె రెండో సినిమా మొదలు కాలేదు. అయితే నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ‘బంగార్రాజు’ లో ఫరియా ఓ స్పెషల్ సాంగ్ లో నర్తిస్తోంది. ఇదిలా ఉంటే.. అమ్మడ్ని ఓ క్రేజీ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది.
‘శ్యామ్ సింగరాయ్’ నిర్మాత వెంకట్ బోయినపల్లి.. మేర్లపాక మురళి దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం నిర్మించబోతున్నారు. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ఇంతకు ముందు సంతోష్.. గాంధీ డైరెక్షన్ లో ‘ఏక్ మినీకథ’ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మంచి అప్లాజ్ లభించిన నేపథ్యంలో వీరి కాంబోలో రెండో సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన రాబోతోంది.