రామ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. కానీ తప్పదంటున్న నిర్మాత
ABN , First Publish Date - 2021-05-15T16:18:09+05:30 IST
రామ్..పుట్టినరోజు శనివారం(మే 15). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తున్నారు. ఈ క్రమంలో..

రామ్ పోతినేని... డాన్సులు, యాక్షన్, ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇలా అన్నింటా తనదైన ముద్ర వేసిన నేటి తరం కథానాయకుడు. ఈ యంగ్ హీరో పుట్టినరోజు శనివారం(మే 15). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తున్నారు. ఈ క్రమంలో హీరో రామ్‌తో లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న నిర్మాత శ్రీనివాస చిట్టూరి రామ్‌కు పుట్గినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే రామ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధించినది కాదు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్ డేట్ వస్తుందని భావించిన అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. అయితే ప్రస్తుతం దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు ఆధారంగా విషయాలను సింపుల్‌గా ఉంచుతున్నామని నిర్మాత తెలిపారు.