ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకుంటారా?

ABN , First Publish Date - 2021-12-14T16:34:30+05:30 IST

పాన్ ఇండియా సినిమాల్ని పక్కా ప్లానింగ్‌తో ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. అన్ని కోణాల్లోనూ ప్రమోషన్స్ ను నిర్వహించాల్సి ఉంటుంది. అవి అభిమానుల్ని కూడా సంతృప్తి పరిచే విధంగా ఉండాలి. బాలీవుడ్‌ లో అయితే.. హీరోలు కానీ, నిర్మాతలు కానీ ప్రతీ చిన్న విషయాన్ని తమ ప్రమోషన్స్ కు అనుగుణంగా మలుచుకుంటారు. ప్రమోషన్స్‌కు సంబంధించిన ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోరు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఇది కొరవడిందని చెప్పాలి. పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్స్ అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకొనే విధంగా మారాయని విమర్శలు వస్తున్నాయి.

ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకుంటారా?

పాన్ ఇండియా సినిమాల్ని పక్కా ప్లానింగ్‌తో ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. అన్ని కోణాల్లోనూ ప్రమోషన్స్ ను నిర్వహించాల్సి ఉంటుంది. అవి అభిమానుల్ని కూడా సంతృప్తి పరిచే విధంగా ఉండాలి.  బాలీవుడ్‌ లో అయితే.. హీరోలు కానీ, నిర్మాతలు కానీ  ప్రతీ చిన్న విషయాన్ని తమ ప్రమోషన్స్ కు అనుగుణంగా మలుచుకుంటారు. ప్రమోషన్స్‌కు సంబంధించిన ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోరు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఇది కొరవడిందని చెప్పాలి. పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్స్ అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకొనే విధంగా మారాయని విమర్శలు వస్తున్నాయి.  త్వరలో విడుదలకు సిద్ధం అయిన  ‘ఆర్.ఆర్.ఆర్, పుష్ప’ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన సంఘటనలు చూస్తే అలాగే అనిపిస్తోంది. 


ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ సినీమ్యాక్స్ లో ప్రెస్ మీట్ జరుగుతుందని, అందులో అభిమానులు కూడా పాల్గొన వచ్చని పాస్ లు ఇచ్చారు. చాలా మంది అభిమానులు ఎంతో ఉత్సాహంతో సినీమ్యాక్స్ కు చేరుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయినట్టుగా చెప్పారు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. తమ అభిమాన హీరోల్ని చూడాలని ఎంతో ఆరాటపడిన వారి ఉత్సాహంపై మేకర్స్ నీళ్ళు జల్లినట్టైంది. అలాగే.. నిన్న (సోమవారం) గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్  ఫోటో షూట్ జరుగుతున్నట్టు సమాచారం అందిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్స్ సమస్యలు తలెత్తాయి. దాంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ ప్రయోగించారు. ఈ సంఘటనలో కొందరు అభిమానులు గాయపడ్డారు. 


అల్లు అర్జున్ ఈ సంఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తపడతానని చెప్పారు. అయినప్పటికీ ఫ్యాన్స్ అంటే పెద్ద హీరోలకు ఎందుకు అంత చులకన అంటూ అభిమానులు చాలా ఎమోషన్ అవుతున్నారు. ఎంత పెద్ద సినిమా విడుదలైనా వాటికి భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టేది తామ లాంటి ఫ్యాన్సేనని, ఆ  సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా.. ముందుగా సంతోషించేది, వాటిని వైరల్ చేసేది తామేనని అలాంటి ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దని ఫ్యాన్స్ తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ‘ఆర్.ఆర్.ఆర్, పుష్ప’ మేకర్స్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.  

Updated Date - 2021-12-14T16:34:30+05:30 IST