ఫ్యామిలీ ఫన్ బిగిన్స్!
ABN , First Publish Date - 2021-02-02T07:07:16+05:30 IST
వెంకటేశ్, తమన్నా ఓ జంటగా... వరుణ్‌తేజ్, మెహరీన్ మరో జంటగా నటిస్తున్న సినిమా ‘ఎఫ్ 3’. ఇందులో కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల...

వెంకటేశ్, తమన్నా ఓ జంటగా... వరుణ్‌తేజ్, మెహరీన్ మరో జంటగా నటిస్తున్న సినిమా ‘ఎఫ్ 3’. ఇందులో కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ సోమవారం నుంచి మొదలైంది. వెంకటేశ్, తమన్నా సహా సీనియర్ నటీనటులు అన్నపూర్ణమ్మ, వై. విజయ, ప్రదీప్ తదితరులపై దర్శకుడు అనిల్ రావిపూడి కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ‘‘వినోదం పంచే కుటుంబం మళ్లీ వచ్చింది. సరదా ప్రయాణానికి సిద్ధం అవ్వండి’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే.