సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

fahad fazil: ఈ విలన్‌కి 'రంగస్థలం' బాగా నచ్చిందట

ABN, First Publish Date - 2021-07-21T17:36:52+05:30

టాలీవుడ్‌కి విలన్‌గా పరిచయం కాబోతున్న ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కి 'రంగస్థలం' మూవీ బాగా నచ్చిందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌కి విలన్‌గా పరిచయం కాబోతున్న ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కి 'రంగస్థలం' మూవీ బాగా నచ్చిందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మలయాళంలో అద్భుతమైనపాత్రలు పోషిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప'తో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌  పాత్రలో నటిస్తుండగా, రెండు భాగాలుగా రూపొందుతోంది. 5 భాషలలో రిలీజ్ కానున్న ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్న ఫహాద్ సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' సినిమా నాకు బాగా నచ్చిందని అన్నాడు. 



ఇక 'పుష్ప' మూవీలోని తన పాత్ర గురించి సుకుమార్ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యానని తెలిపాడు. ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదన్న ఆయన..తన టాలీవుడ్ ఎంట్రీకి ఇది సరైన పాత్ర అని తెలిపారు. మలయాళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికి 'రంగస్థలం', 'పుష్ప వంటి సినిమాలు చెయలేదని పేర్కొన్నాడు ఫహాద్. కాగా 'పుష్ప' మూవితో పాటు తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న 'విక్రమ్' లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.     


Updated Date - 2021-07-21T17:36:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!