‘పుష్ప’లో ఐపీఎస్‌గా...

ABN , First Publish Date - 2021-08-29T05:41:13+05:30 IST

నుదుటిపై గాటు... నున్నగా గీసిన గుండు... చెవిపోగు... అన్నిటికీ మించి కళ్లలో కరుడుకట్టిన క్రోదం... మలయాళ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ కొత్తగా కనిపిస్తున్నారు...

‘పుష్ప’లో ఐపీఎస్‌గా...

నుదుటిపై గాటు... నున్నగా గీసిన గుండు... చెవిపోగు... అన్నిటికీ మించి కళ్లలో కరుడుకట్టిన క్రోదం... మలయాళ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ కొత్తగా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’లో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఫహాద్‌ ఫాజిల్‌ ఫస్ట్‌లుక్‌ శనివారం విడుదల చేశారు. ఐపీఎస్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా కనిపించనున్నారని చిత్రబృందం పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌లో విడుదల కానుంది. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌.


Updated Date - 2021-08-29T05:41:13+05:30 IST