సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వినోదం... మూడురెట్లు!

ABN, First Publish Date - 2021-09-18T05:01:54+05:30

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ మొదలైంది. ఈసారి మూడురెట్లు వినోదం పంచుతామని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ మొదలైంది. ఈసారి మూడురెట్లు వినోదం పంచుతామని చిత్రదర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. ‘‘మళ్లీ చిత్రీకరణ మొదలైంది. ‘ఎఫ్‌ 3’ కుటుంబంతో సెట్స్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్లు తమన్నా, మెహరీన్‌, నటీనటులు అన్నపూర్ణ, వై. విజయ, సునీల్‌, రఘుబాబు, ఆలీ, ప్రగతి తదితరులు పాల్గొంటున్నారు. శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నామని, ‘ఎఫ్‌ 3’ కోసం దేవిశ్రీ ప్రసాద్‌ ప్రత్యేకంగా బాణీలు సిద్ధం చేశారని నిర్మాత శిరీష్‌ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌, సహ నిర్మాత: హర్షిత్‌రెడ్డి.

Updated Date - 2021-09-18T05:01:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!