F3 : భారీ షెడ్యూల్ పూర్తి!

ABN , First Publish Date - 2021-10-18T16:32:53+05:30 IST

రెండేళ్ళ క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్2’. అజేయ దర్శకుడు అనిల్ రావిపూడి మలిచిన ఈ సినిమా నవ్వుల్ని పూయించింది. వెంకీ, వరుణ్ తేజ్ నటన, తమన్నా, మెహ్రీన్ గ్లామర్ షో, సాంగ్స్, కామెడీ పంచులు సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ రూపొందుతోంది.

F3 : భారీ షెడ్యూల్ పూర్తి!

రెండేళ్ళ క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్2’. అజేయ దర్శకుడు అనిల్ రావిపూడి మలిచిన ఈ సినిమా నవ్వుల్ని పూయించింది. వెంకీ, వరుణ్ తేజ్ నటన, తమన్నా, మెహ్రీన్ గ్లామర్ షో, సాంగ్స్, కామెడీ పంచులు సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ రూపొందుతోంది. అవే పాత్రలతో, కామెడీ మోతాదు పెంచుతూ.. అనిల్ చేస్తోన్న మరో కామెడీ మాయాజాలంలో సునీల్, బోమన్ ఇరానీ, ఇంకా మరికొందరు నటీనటులు అదనంగా చేరుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా ‘ఎఫ్ 3’ చిత్రం హైద్రాబాద్‌లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్టు వరుణ్ తేజ ట్విట్టర్‌లో తెలిపారు. 



‘ఎఫ్ 3 మూవీ భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పిచ్చిగా నవ్వులు పండిస్తుంది.  సోదరుడు వెంకీతో నటిస్తుంటే ఎప్పుడూ నాకు ఉత్సాహమే. తదుపరి షెడ్యూల్ వరకూ ఆగలేకపోతున్నాను’... అంటూ ఓ వ్యాఖ్యను జోడించి.. తను, వెంకటేశ్ దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎఫ్ 2 స్థాయిలోనే భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.   



Updated Date - 2021-10-18T16:32:53+05:30 IST