ఉత్కంఠత రేకెత్తించే ‘రెక్కీ’
ABN , First Publish Date - 2021-12-28T05:46:30+05:30 IST
అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రెక్కీ’. భద్రమ్ కీలక పాత్రధారి. అమీక్షా పవార్, జస్విక కథానాయికలు....

అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రెక్కీ’. భద్రమ్ కీలక పాత్రధారి. అమీక్షా పవార్, జస్విక కథానాయికలు. ఎన్.ఎ్‌స.ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. కమలకృష్ణ నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు. మా కథ కూడా అంతే. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంద’’న్నారు. ‘‘ఇలాంటి కథ ఇప్పటి వరకూ టాలీవుడ్‌లోనే రాలేదు. స్ర్కీన్ ప్లే షాకింగ్‌గా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయ’’ని నిర్మాత తెలిపారు.