#Aha Studio : వెబ్ సిరీస్‌గా పీవీ బయోపిక్

ABN , First Publish Date - 2021-12-14T17:22:29+05:30 IST

ప్రస్తుతం ఇండియన్ స్ర్కీన్ బయోపిక్స్‌కు కేరాఫ్ అడ్రెస్ అయింది. అన్ని రంగాల్లోనూ విశేషమైన కృషి చేసిన ప్రముఖుల జీవిత చరిత్రపై సినిమాలు తీయడం ఇప్పుడు సరికొత్త డ్రెండ్. ఈ ప్రయత్నంలో పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. మరికొన్ని పరాజయం పాలయ్యాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిన మరో ప్రముఖ వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అవడం విశేషం. భారతదేశాన్ని ఆర్ధిక సంస్కరణలవైపు నడిపించిన ప్రధానిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది.

#Aha Studio : వెబ్ సిరీస్‌గా పీవీ బయోపిక్

ప్రస్తుతం ఇండియన్ స్ర్కీన్ బయోపిక్స్‌కు కేరాఫ్ అడ్రెస్ అయింది. అన్ని రంగాల్లోనూ విశేషమైన కృషి చేసిన ప్రముఖుల జీవిత చరిత్రపై సినిమాలు తీయడం ఇప్పుడు సరికొత్త డ్రెండ్. ఈ ప్రయత్నంలో పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. మరికొన్ని పరాజయం పాలయ్యాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిన మరో ప్రముఖ వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అవడం విశేషం. భారతదేశాన్ని ఆర్ధిక సంస్కరణలవైపు నడిపించిన ప్రధానిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ బయోపిక్ పేరు ‘హాఫ్ లయన్’.  ఆయన పేరు నరసింహం కాబట్టి ఈ టైటిల్ పెట్టినట్టు అర్ధం చేసుకోవచ్చు. ఆయన పేరులో సగం మనిషి, సగం సింహం ఉన్నట్టుగా ఆయన జీవితం కూడా అలాగే సాగింది. దేశానికి సేవ చేయడంలో మానవత్వం కలిగిన మనిషి. ఎవరికీ తలవంచక తన పనితాను చేసుకుపోవడంలో ఆయన సింహంలాంటి వ్యక్తి. 


అయితే ఈ బయోపిక్ తెరకెక్కేది సినిమాగా కాదు. వెబ్ సిరీస్ గా. ఇలాంటి అద్బుతమైన బయోపిక్ నిర్మించేది మరెవరో కాదు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ . సొంత డిజిటల్ ప్లాట్ ఫామ్ .. ఆహా కోసం ఈ బయోపిక్ నిర్మించబోతున్నారు. ఆదిత్యా బిర్లా గ్రూప్ కు సంబంధించిన కంటెంట్ స్డూడియో ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి పాన్ ఇండియా బైలింగ్విల్  వెబ్ సిరీస్ గా ‘హాఫ్‌ లయన్’ ను రూపొందించబోతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లాంఛింగ్ ను అల్లు అరవింద్ గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.  వినయ్ సీతాపతి రాసిన ‘హాఫ్ లయన్’ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. దీన్ని బాలీవుడ్ దర్శకుడు ప్రకాశ్ ఝా తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన కేస్టింగ్ ఎవరనేది ఇంకా తెలియలేదు. మరి పీవీగా నటించే నటుడు ఎవరై ఉంటారో చూడాలి.



Updated Date - 2021-12-14T17:22:29+05:30 IST