'సర్కారు వారి పాట'లో ప్రతిదీ కొత్తగా ఉంటుంది : రామ్ లక్ష్మణ్
ABN , First Publish Date - 2021-06-20T15:40:11+05:30 IST
'సర్కారు వారి పాట'లో ప్రతిదీ కొత్తగా ఉంటుంది.. అంటున్నారు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ 14 రీల్స్ ప్లస్ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
'సర్కారు వారి పాట'లో ప్రతిదీ కొత్తగా ఉంటుంది.. అంటున్నారు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ 14 రీల్స్ ప్లస్ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఓ షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు.. పాటలు అలాగే ఓ ఫైట్ చిత్రబృందం తెరకెక్కించింది. మహేష్ చేసిన భారీ ఫైట్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. దుబాయ్ పోరాట సన్నివేశం అసాధారణమైనదని, మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రేక్షకులు థ్రిల్ అవుతారని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తెలిపారు.
మా కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన స్టంట్స్‌ను కొరియోగ్రాఫి చేశాం. వాటన్నిటికి పూర్తి భిన్నంగా సర్కారు వారి పాటలో ప్రతిదీ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఈ అనుభవం మాక్కూడా కొత్తగా ఉంది. మొదటిసారి కొత్త బృందంతో కలిసి పనిచేసినా, యూనిక్‌గా ప్రయత్నించాం.. అని రామ్-లక్ష్మణ్ చెప్పారు. వీరు చెప్పినదాన్నిబట్టి ఈ సినిమాలో యాక్షన్ అండ్ ఛేజింగ్ సీన్స్ ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయనిపిస్తోంది. ఇక త్వరలో మొదలవనున్న షెడ్యూల్‌లో కన్నడ నటుడు అర్జున్ - మహేష్ బాబుల మధ్య కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరించనున్నారని సమాచారం.