100 మిలియన్ల క్లబ్‌లో.. ‘ఎల్లువచ్చి గోదారమ్మ‌’

ABN , First Publish Date - 2021-06-16T00:32:49+05:30 IST

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా.. పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గద్దలకొండ గణేష్‌'. ఈ చిత్రంలోని 'ఎల్లువచ్చి గోదారమ్మ' సాంగ్‌ 100 మిలియన్ల క్లబ్‌లో

100 మిలియన్ల క్లబ్‌లో.. ‘ఎల్లువచ్చి గోదారమ్మ‌’

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా.. పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గద్దలకొండ గణేష్‌'. ఈ చిత్రంలోని 'ఎల్లువచ్చి గోదారమ్మ' వీడియో సాంగ్‌ 100 మిలియన్ల క్లబ్‌లో చేరినట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. వాస్తవానికి ఈ పాటకున్న ప్రత్యేకత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభన్‌ బాబు, శ్రీదేవిల కాంబినేషన్‌లో దర్శకేంద్రుడు తెరకెక్కించిన 'దేవత' చిత్రంలోనిదీ పాట. అప్పట్లో ఈ పాట ఎంత సంచలనం సృష్టించిందో.. 'గద్దలకొండ గణేష్‌'లో వరుణ్‌, పూజాలతో హరీష్‌ శంకర్‌ రీక్రియేట్‌ చేసిన ఈ పాట కూడా అంతే విజయవంతంగా ప్రేక్షకులను అలరించింది. వరుణ్‌, పూజాల స్టెప్స్‌ అందరినీ మైమరపించాయి. ఈ పాట 100 మిలియన్ల వ్యూస్‌ సాధించిన సందర్భంగా చిత్రయూనిట్‌ తమ సంతోషాన్ని తెలియజేసింది.  



Updated Date - 2021-06-16T00:32:49+05:30 IST