నటి రక్షిత నిర్మించే చిత్రంలోని రెండో పాట వదిలారు

ABN , First Publish Date - 2021-04-14T01:44:14+05:30 IST

హీరోయిన్ రక్షిత నిర్మాతగా మారి.. తన తమ్ముడు రానాను హీరోగా పరిచయం చేస్తూ నాలుగు భాషల్లో నిర్మించిన సినిమా ‘ఏక్ లవ్ యా’. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో

నటి రక్షిత నిర్మించే చిత్రంలోని రెండో పాట వదిలారు

హీరోయిన్ రక్షిత నిర్మాతగా మారి.. తన తమ్ముడు రానాను హీరోగా పరిచయం చేస్తూ నాలుగు భాషల్లో నిర్మించిన సినిమా ‘ఏక్ లవ్ యా’. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ‘ఏక్ లవ్ యా’ మూవీకి రక్షిత భర్త, కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట శ్రోతల నుంచి మంచి స్పందనను రాబట్టుకుని.. 5 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఉగాది పండుగ సందర్భంగా  ఈ చిత్రంలోని 'కాలాన్ని మరచి' అని సాగే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసింది టీమ్. ఈ పాటను దర్శకుడు ప్రేమ్ పాడటం విశేషం. లవ్ మెలొడీస్‌ను ఇష్టపడే వారికి 'కాలాన్ని మరచి' పాట బాగా నచ్చుతుంది.  ‘ఏక్ లవ్ యా’ త్వరలోనే నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. రానా సరసన రీష్మీ, రచితా రామ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అర్జున్‌ జాన్య సంగీతం అందిస్తున్నారు.



Updated Date - 2021-04-14T01:44:14+05:30 IST