‘ఏక్ మినీ కథ’ నుంచి.. ఈ మాయలో పాటొచ్చింది

ABN , First Publish Date - 2021-03-19T01:24:28+05:30 IST

టాలీవుడ్‌ టాప్‌ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎటువంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు వచ్చాయో తెలియంది కాదు. ఇప్పుడీ సంస్థకు అనుబంధ సంస్థగా స్థాపించబడిన

‘ఏక్ మినీ కథ’ నుంచి.. ఈ మాయలో పాటొచ్చింది

టాలీవుడ్‌ టాప్‌ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎటువంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు వచ్చాయో తెలియంది కాదు. ఇప్పుడీ సంస్థకు అనుబంధ సంస్థగా స్థాపించబడిన యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌లో వస్తోన్న చిత్రం 'ఏక్‌ మినీ కథ'. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలనే నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ బ్యాన‌ర్‌లో ప్రస్తుతం 'ఏక్ మినీ కథ' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మూడు భాషల్లో ఆసక్తికరంగా ఉన్న ఈ టైటిల్‌తోనే ఆకర్షిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్‌గానే టీజర్‌ వదిలారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అదిరిపోనుంది అనేలా టీజర్‌ చెప్పకనే చెప్పేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ మాయలో.. అనే లిరికల్ సాంగ్ గురువారం విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. 



ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ పాటకు శ్రీజో ఇచ్చిన సాహిత్యం కూడా చక్కగా కుదిరింది. లిప్సిక, స్వీకర్‌, అగస్తి ఈ పాటను ఆలపించారు. సంతోష్‌ శోభన్‌, కావ్య తాపర్‌, శ్రద్ధాదాస్‌ వంటి వారు నటించిన ఈ చిత్రానికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించడం విశేషం. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ని వదిలేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతోంది.

Updated Date - 2021-03-19T01:24:28+05:30 IST