ఆకట్టుకుంటోన్న 'దృశ్యం 2' టీజర్‌

ABN , First Publish Date - 2021-01-01T20:47:34+05:30 IST

మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దృశ్యం2'. ఆంటోని పెరుంబవూర్‌ నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను కొత్త ఏడాది సందర్భంగా విడుదల చేశారు.

ఆకట్టుకుంటోన్న 'దృశ్యం 2' టీజర్‌

మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దృశ్యం2'. ఆంటోని పెరుంబవూర్‌ నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను కొత్త ఏడాది సందర్భంగా విడుదల చేశారు. ఇదే కాంబినేషన్‌లో 2013లో విడుదలై ఫ్యామిలీ, మర్డర్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన దృశ్యంకు ఇది సీక్వెల్‌గా రూపొందింది. టీజర్‌ చూస్తుంటే ఆసక్తికరంగా ఉంది. దీన్ని తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌ చేశారు. మరి సీక్వెల్‌గా రూపొందుతోన్న దృశ్యం 2ను రీమేక్‌ చేస్తారా?  లేక అనువాదం చేసి విడుదల చేస్తారా? అని తెలియడం లేదు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చినప్పుడు నలబై ఆరు రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేశారు. కేరళలో ఇంకా థియేటర్స్‌ ఓపెన్‌ కాకపోవడంతో దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. 




Updated Date - 2021-01-01T20:47:34+05:30 IST