అఫిషీయల్‌.. తెలుగులో 'దృశ్యం 2' రీమేక్‌

ABN , First Publish Date - 2021-02-21T01:12:15+05:30 IST

నిర్మాత డి.సురేష్‌బాబు, హీరో విక్టరీ వెంకటేష్‌లను 'దృశ్యం 2' డైరెక్టర్‌ జీతూ జోసెఫ్‌, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌ ప్రత్యేకంగా కలిశారు.

అఫిషీయల్‌.. తెలుగులో 'దృశ్యం 2' రీమేక్‌

మలయాళంలో మోహన్‌లాల్‌, జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో రూపొందిన థ్రిల్లర్‌ మూవీ 'దృశ్యం' ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. తర్వాత ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ అయ్యింది. శ్రీప్రియ తెరకెక్కించిన తెలుగు 'దృశ్యం'లో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించారు. తెలుగులోనూ 'దృశ్యం' మంచి హిట్‌ను సాధించింది. లేటెస్ట్‌గా మలయాళంలో 'దృశ్యం' సీక్వెల్‌గా రూపొందిన 'దృశ్యం 2' ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలను అందుకుంటోంది. దీంతో 'దృశ్యం 2'ను తెలుగులో రీమేక్‌ చేస్తారా? అనే వార్తలు హల్‌ చల్‌ చేయడం ప్రారంభించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ శనివారం నిర్మాత డి.సురేష్‌బాబు, హీరో విక్టరీ వెంకటేష్‌లను 'దృశ్యం 2' డైరెక్టర్‌ జీతూ జోసెఫ్‌, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌ ప్రత్యేకంగా కలిశారు. సమావేశం అనంతరం నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌ తెలుగులో దృశ్యం2 రీమేక్‌ కానుందని అధికారికంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. మార్చిలో షూటింగ్‌ను స్టార్ట్‌ చేసి రెండు నెలల్లోనే సినిమాను పూర్తి చేసేలా ప్రణాళికలు జరుగుతున్నాయని సమాచారం. 



Updated Date - 2021-02-21T01:12:15+05:30 IST