drishyam 2 : ట్రైలర్ వచ్చేస్తోంది!
ABN, First Publish Date - 2021-11-14T21:49:10+05:30
విక్టరీ వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’. మలయాళ మూవీ ‘దృశ్యం 2’ కిది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మలయాళ వెర్షన్ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో.. అదే దర్శకుడితో తెలుగు వెర్షన్ ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళారు. ఈ నెల 25న ‘దృశ్యం 2’ తెలుగు వెర్షన్ ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు.
విక్టరీ వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’. మలయాళ మూవీ ‘దృశ్యం 2’ కిది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మలయాళ వెర్షన్ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో.. అదే దర్శకుడితో తెలుగు వెర్షన్ ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళారు. ఈ నెల 25న ‘దృశ్యం 2’ తెలుగు వెర్షన్ ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన దక్కింది. ఈ క్రమంలో రేపు (సోమవారం) ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే దానికి సంబంధించిన పిక్స్ లో విషయాన్ని అస్పష్టంగా రివీల్ చేసి.. ఒక ఫజిల్ లా వదిలారు.
మొదటి భాగంలో వరుణ్ మర్డర్ కేసు నుంచి రాంబాబు తన ఫ్యామిలీని తెలివిగా కాపాడుకోవడం కనిపిస్తుంది. అయితే దానికి కంటిన్యూషన్ గా రాబోతున్న రెండో భాగంలో.. మళ్ళీ ఆరేళ్ళకి ఇదే కేసు రాంబాబు ఫ్యామిలీని వెంటాడుతుంది. ఈసారి అతడు ఏ విధంగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అన్నదే కథాంశం. రాంబాబుగా వెంకీ మేకోవర్ ఆకట్టకుంటోంది. మీనా, కృతిక, ఎస్తేర్ అనిల్, నదియా, నరేశ్ పాత్రలతో పాటు .. రెండో భాగంలో కొత్తగా సంపత్ రాజ్, వినయ్ వర్మ పాత్రలు కూడా ఎంటర్ అవుతాయి. మరి మలయాళ వెర్షన్ స్థాయిలోనే తెలుగు వెర్షన్ కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి.