యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ‘మర్మాణువు’.. టైటిల్ లుక్ అదిరింది

ABN , First Publish Date - 2021-03-26T00:14:32+05:30 IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కబోతోన్న కొత్త చిత్ర టైటిల్‌ని గురువారం ప్రకటించారు. పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ‘మర్మాణువు’.. టైటిల్ లుక్ అదిరింది

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కబోతోన్న కొత్త చిత్ర టైటిల్‌ని గురువారం ప్రకటించారు. పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘మర్మాణువు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. విజయ ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారు. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు వెంకటేష్ మహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లుక్ విడుదల చేశాము. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తాం అనేది త్వరలో వెల్లడిస్తాం’’ అని తెలిపారు.



Updated Date - 2021-03-26T00:14:32+05:30 IST