దాచిపెట్టను... పైకి చెప్పను!

ABN , First Publish Date - 2021-06-04T06:49:31+05:30 IST

‘‘హాలీవుడ్‌లో ఓ నటికి పెళ్లైనా... ఆమె తల్లైనా... పెద్ద విషయం కాదు. ఎవరూ పట్టించుకోరు. మన దగ్గర నటుడి(హీరో) విషయంలో ఆ విధంగా జరుగుతుంది....

దాచిపెట్టను... పైకి చెప్పను!

‘‘హాలీవుడ్‌లో ఓ నటికి పెళ్లైనా... ఆమె తల్లైనా... పెద్ద విషయం కాదు. ఎవరూ పట్టించుకోరు. మన దగ్గర నటుడి(హీరో) విషయంలో ఆ విధంగా జరుగుతుంది. అదే మహిళల (హీరోయిన్ల) విషయమైతే అంతా  పట్టించుకుంటారు. ఇది చాలా బాధాకరం!’’ శ్రుతీ హాసన్‌ అన్నారు. హీరోయిన్లు ప్రేమలో పడిన తర్వాత లేదా పెళ్లైన తర్వాత ఎదురయ్యే పరిస్థితులపై ఆమె ఈ విధంగా స్పందించారు. శాంతను హజారికతో శ్రుతీ హాసన్‌ ప్రేమానుబంధంలో ఉన్నారనే సంగతి సామాజిక మాధ్యమాల్లో ఆమె ఖాతాలను అనుసరిస్తున్న నెటిజన్లకు తెలిసిన విషయమే. శాంతనుతో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తుంటారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేటింగ్‌ లైఫ్‌ గురించి శ్రుతీని ప్రశ్నించగా... ‘‘చూడండి! నాకు దాచిపెట్టడం ఇష్టం ఉండదు. గతంలో దాచాను. కానీ, ఇప్పుడు అవసరం లేదని అనిపిస్తోంది. ఎందుకంటే... ఏదో ఒక సమయంలో బయటకొస్తుంది. అందరికీ తెలుస్తుంది. కానీ, నాకు ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడాలని లేదు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యత పాటించాలనుకుంటున్నా. నేను ప్రేమ విషయాన్ని దాచను. అలాగని, వేడుక చేయను. పైకి గట్టిగా చెప్పను’’ అని వివరించారు. 

Updated Date - 2021-06-04T06:49:31+05:30 IST