డైరెక్టర్ శ్రీను వైట్లకు పితృవియోగం
ABN , First Publish Date - 2021-11-28T17:55:22+05:30 IST
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల తండ్రి వైట్ల కృష్ణారావు (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు.
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల తండ్రి వైట్ల కృష్ణారావు (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందుల పాలెం. కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తండ్రి కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు.