సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

డిస్నీ హాట్‌ స్టార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌చరణ్‌

ABN, First Publish Date - 2021-09-20T12:31:54+05:30

ఇప్పటివరకూ ప్రాంతీయ భాషల మీద అంతగా ఫోకస్‌ పెట్టని ఓటీటీ సంస్థలు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో డిస్నీ హాట్‌స్టార్‌ కూడా తెలుగులోకి రానుంది. ఈ సంస్థకు రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటివరకూ ప్రాంతీయ భాషల మీద అంతగా ఫోకస్‌ పెట్టని  ఓటీటీ సంస్థలు ఇప్పుడు  ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో డిస్నీ హాట్‌స్టార్‌ కూడా తెలుగులోకి రానుంది. ఈ సంస్థకు రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. ‘మన వినోద విశ్వం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆయన డిస్నీ హాట్‌ స్టార్‌ను ప్రమోట్‌ చేయనున్నారు. గత ఏడాది తమిళంలోకి అడుగుపెట్టి విజయం సాధించామనీ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నామనీ డిస్నీ హాట్‌ స్టార్‌ కంటెంట్‌ హెడ్‌ సౌరవ్‌ బెనర్జీ చెప్పారు. ‘ఇండియాలో కంటెంట్‌కు దిక్సూచిలా డిస్నీ హాట్‌స్టార్‌ నిలుస్తోంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్‌ సిరీస్‌ లను తీసుకువస్తోంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ మార్కెట్‌లోకి డిస్నీ హాట్‌ స్టార్‌ ప్రవేశిస్తుండడంతో నటీనటులకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. వినోదాన్ని కోరుకునే తెలుగు ప్రేక్షకులను తమ కంటెంట్‌తో డిస్నీ హాట్‌స్టార్‌ అలరిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు.


Updated Date - 2021-09-20T12:31:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!