సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సముద్రం, కెరటాలు అంత ఒరిజినల్‌గా...

ABN, First Publish Date - 2021-09-26T05:30:00+05:30

చక్కని ప్రేమకథా చిత్రాలతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు శివ నిర్వాణ. తొలి చిత్రం ‘నిన్ను కోరి’ మలిచిత్రం ‘మజలీ’తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్కని ప్రేమకథా చిత్రాలతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు శివ నిర్వాణ. తొలి చిత్రం ‘నిన్ను కోరి’ మలిచిత్రం ‘మజలీ’తో మంచి విజయాలను అందుకున్నారు. ఇటీవలె విడుదలైన నాని ‘టక్‌ జగదీష్‌’ చిత్రంతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్నారు శివ నిర్వాణ. త్వరలో ఆయన నుంచి మరో ప్రేమకథా చిత్రం రాబోతోంది. ఈ విషయాన్ని శనివారం ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో తెలిపారు. తనగత చిత్రాలకు ప్రేక్షకులు చక్కని విజయాలను అందించారని, ఆ స్ఫూర్తితో నాలుగో చిత్రం కోసం మరో ప్రేమకథను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. సముద్రం, కెరటాలు ఎంత ఒరిజినల్‌గా ఉంటాయో తన కొత్త సినిమా కథ కూడా అంతే ఒరిజినల్‌గా ఉంటుందని ఆయన చెప్పారు. యువతను ఆకట్టుకునే భావోద్వేగపరమైన అంశాలతో సినిమా తెరకెక్కుతుందని అన్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - 2021-09-26T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!