నాన్ బెయిలబుల్ వారెంట్‌పై శంకర్ వివరణ
ABN , First Publish Date - 2021-02-02T16:01:32+05:30 IST
నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందనే వార్తలు ఆదివారం రోజున సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీనిపై డైరెక్టర్ శంకర్ వివరణ ఇచ్చారు.

'రోబో' సినిమా కథకు సంబంధించిన వివాదంపై కోర్టు కేసు నడుస్తుంది. ఈ కేసులో స్టార్ డైరెక్టర్ శంకర్‌పై చెన్నై ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందనే వార్తలు ఆదివారం రోజున సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీనిపై డైరెక్టర్ శంకర్ వివరణ ఇచ్చారు. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తెలుసుకుని షాకైన శంకర్.. తన లాయర్ ద్వారా కోర్టును సంప్రదించారు శంకర్. అయితే తనపై ఎలాంటి అరెస్ట్ వారెంట్ జారీ కాలేదని, ఆన్‌లైన్‌లో జరిగిన పొరపాటు కారణంగానే ఈ సమస్య వచ్చిందని శంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా అవాస్తవాలను ప్రసారం చేయవద్దని మీడియాను రిక్వెస్ట్ చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.