కరోనాతో దర్శకుడు నంధ్యాల రవి మృతి

ABN , First Publish Date - 2021-05-15T04:10:13+05:30 IST

దర్శకుడు నంద్యాల రవి (42) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆర్థికంగా సమస్యలు ఎదురవ్వగా....

కరోనాతో దర్శకుడు నంధ్యాల రవి మృతి

దర్శకుడు నంద్యాల రవి (42) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆర్థికంగా సమస్యలు ఎదురవ్వగా, చిత్రసీమలో కొందరు ఆయనకు సహాయం చేశారు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రంతో దర్శకుడిగా మారిన రవి... అంతకు ముందు ‘నేనూ సీతామహాలక్ష్మీ’, ‘పందెం’, ‘అసాధ్యుడు’, ఇటీవల ‘ఒరేయ్‌ బుజ్జిగా’, ‘పవర్‌ ప్లే’ చిత్రాలకు రచయితగా పని చేశారు. ఆయన స్వస్థలం పాలకొల్లు సమీపంలోని సరిపల్లి గ్రామం. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. నంద్యాల రవి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-15T04:10:13+05:30 IST