డైరెక్టర్‌ క్రిష్‌కు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-01-03T02:41:06+05:30 IST

గత కొన్ని నెలలుగా అందరి నోళ్లలో నానుతున్న పేరు ఏదైనా ఉంది అంటే.. అది ఖచ్చితంగా కరోనానే. అందరి జీవన విధానాన్ని మార్చేసిన ఈ మహమ్మారి

డైరెక్టర్‌ క్రిష్‌కు కరోనా పాజిటివ్‌

గత కొన్ని నెలలుగా అందరి నోళ్లలో నానుతున్న పేరు ఏదైనా ఉంది అంటే.. అది ఖచ్చితంగా కరోనానే. అందరి జీవన విధానాన్ని మార్చేసిన ఈ మహమ్మారి.. ఇంకా తన ప్రతాపాన్ని చూపెడుతూనే ఉంది. ఇంకా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ తమకి పాజిటివ్‌ వచ్చినట్లుగా సోషల్‌ మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా క్రియేటివ్‌ దర్శకుడు క్రిష్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.


జనవరి 4 నుంచి పవన్‌ కల్యాణ్‌తో చేయాల్సిన చిత్ర షూటింగ్‌ మొదలవుతుండటంతో.. యూనిట్‌ అంతా కరోనా టెస్ట్‌లు చేయించుకోగా, అందులో క్రిష్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినట్లుగా తెలుస్తుంది. దీంతో చిత్ర నిర్మాత ఏఎం రత్నం చిత్ర షూటింగ్‌ను క్యాన్సిల్‌ చేసినట్లుగా టాక్‌ నడుస్తోంది. అయితే.. తనకి పాజిటివ్‌ వచ్చినట్లుగా డైరెక్టర్‌ క్రిష్ మాత్రం ఎక్కడా తెలియజేయలేదు.

Updated Date - 2021-01-03T02:41:06+05:30 IST