ధర్మస్థలికి ఆపదొస్తే...

ABN , First Publish Date - 2021-11-29T11:16:44+05:30 IST

చిరంజీవి, రామ్‌ చరణ్‌... ఇద్దరూ ఒకే తెరపై కనిపిస్తే, అభిమానులకు పండగే. ‘మగధీర’, ‘బ్రూస్లీ’, ‘ఖైదీ నెం.150’... చిత్రాలలో ఈ మ్యాజిక్‌ కనిపించింది...

ధర్మస్థలికి ఆపదొస్తే...

చిరంజీవి, రామ్‌ చరణ్‌... ఇద్దరూ ఒకే తెరపై కనిపిస్తే, అభిమానులకు పండగే. ‘మగధీర’, ‘బ్రూస్లీ’, ‘ఖైదీ నెం.150’... చిత్రాలలో ఈ మ్యాజిక్‌ కనిపించింది. ఇప్పుడు ‘ఆచార్య’లో అంతకు మించిన మాయాజాలం చూపించబోతున్నారు కొరటాల శివ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి కథానాయకుడు. రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్‌, పూజా హెగ్డే కథానాయికలు. ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ సిద్ధ అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆదివారం సిద్ధ పాత్రని పరిచయం చేస్తూ ఓ టీజర్‌  వదిలారు. ‘ధర్మస్థలికి ఆపదొస్తే... అది జయించడానికి అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అనే డైలాగ్‌ ఈ టీజర్‌ లో వినిపించింది. చరణ్‌ లుక్‌, యాక్షన్‌ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. చివర్లో... చిరు, చరణ్‌ ఒకేసారి మెరుపులా కనిపించడం అభిమానులకు నచ్చుతుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో సోనూసూద్‌ ప్రతినాయకుడిగా నటించారు.  


Updated Date - 2021-11-29T11:16:44+05:30 IST