జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ధనుష్ సినిమా
ABN, First Publish Date - 2021-03-19T03:26:05+05:30
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘అసురన్’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. మణిమారన్ దర్శకత్వంలో తెరకెక్కి
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘అసురన్’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. మణిమారన్ దర్శకత్వంలో తెరకెక్కి 2019లో విడుదలైన ఈ చిత్రంలో మంజూవారియర్, పశుపతి, కెన్ కరుణాస్ కీలక పాత్రలను పోషించారు. వంద కోట్ల రూపాయల వరకు వసూళ్ళు రాబట్టిన ఈ మూవీని పలు భాషల్లో రీమేక్ చేసేందుకు బడా నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు.. పలు ప్రాంతాల్లో జరిగిన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన అసురన్ ఇప్పుడు జపాన్ దేశంలోని ఒసాకా నగరంలో జరుగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రం విభాగంలోనూ పోటీ పడుతోంది.