‘నేరగాడు’గా ‘కబాలి’ ఫేమ్ ధన్సిక నటించిన చిత్రం
ABN , First Publish Date - 2021-01-19T22:11:24+05:30 IST
తమిళంలో మంచి విజయం సాధించిన ఓ చిత్రాన్ని 'నేరగాడు' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.. ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో

తమిళంలో మంచి విజయం సాధించిన ఓ చిత్రాన్ని 'నేరగాడు' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.. ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో విశేష అనుభవం కలిగిన యువ వ్యాపారవేత్త జి.ఎస్.ఎన్.మూర్తి (చిన్ని). గారపాటి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ హారర్ ఎంటర్‌టైనర్‌ను ఆయన నిర్మిస్తున్నారు. కబాలి ఫేమ్ ధన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జి.ఎస్.ఆర్.మూర్తి (చిన్ని) తెలిపారు. రెగ్యులర్ హారర్ చిత్రాలకు భిన్నంగా.. హారర్ కు యాక్షన్ అండ్ సెంటిమెంట్ జోడించిన "నేరగాడు".. అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని ఆయన తెలిపారు.